పల్లవి:
ఆకాశాన్నే తాకుతున్నదే ...
సూర్య చంద్రులను దాటుతున్నదే ...
నక్షత్రాల్లో తేలుతున్నదే ... ఈ రోజే నా మనసే ...
ఏ రెక్కలు లేకుండా ... ఏ సాయం లేకుండా ...
అల్లాదీన్ కాలీన్ లా ఎగిరిందే ...
ఏదో ఆలీబాబా సాధించిన గని సాంతం ...
నీ రూపంలా తోచి శిల ఐందే ...
చేజారిందే ... చేజారిపోయిందే .. జారిపోయిందే నా మనసే ...
చరణం-1:
బంగరు జింక .. నింగిలో ఆ నెలవంక ..
సూటిగా తారల వంక కాంతి వెదజల్లిందే ...
ఐతే పాపం వెలుగులే చుక్కల దాకా ...
అంతగా చేరకమాంతం అక్కడే నిలిచిందే ...
ఏ దారెటు వైపు ... ఏ అడుగెటువైపు .. సాగాలో ఏమో అంటుందే ...
చేజారిందే ... చేజారిపోయిందే ... జారిపోయిందే నా మనసే ...
చరణం-2:
భూలోకంలో ఏ మూల నువ్వున్నావో ...
ఆచూకి ఆరా తీసే అస్త్రాలు ఏవంట ...
మాలోకంలా మైకాన మునిగిందేమో ...
ఏ దారి తోచని మనసే నిలువు నీరైందంట ...
పరిమళ గంధాలు ... విరిసిన అందాలు ... వేసిన బంధాలు నీవంట ...
చేజారిందే ... చేజారిపోయిందే .. జారిపోయిందే నా మనసే ...
అంకితం
Search
Wednesday, August 4, 2010
Tuesday, June 22, 2010
కాలం అచ్చొస్తే ...
పల్లవి:
కాలం అచ్చొస్తే ...
గెలుపిక వరిస్తే ...
ఓటమి అనే మాటకే టాటా ...
పున్నమి అనే బాటకీ పూట ...
స్వాగతమనే నవ్వులను చూద్దాం ...
జీవితమనే పువ్వులను చేద్దాం ...
కాలం అచ్చొస్తే ...
గెలుపిక వరిస్తే ...
చరణం-1:
స్మైలిస్తే హుష్ కాకంటూ ఎగరక ...
సారోలే మిగులునా ఒంటరిగా ...
రాజసం చూపావంటే ఎదురుగా ...
కాలమే తలొంచదా రాణిగా ...
కలలే ఓ తీపి నిజమైతే తన సొమ్మేం అరిగిపోదుగా ...
అని కునుకే తీస్తూ కూర్చుంటే గత కాలమే తిరిగి రాదుగా ...
కాలం అచ్చొస్తే ...
గెలుపిక వరిస్తే ...
చరణం-2:
సాహసం చేసేయరా డింభకా ...!
సాగరం ఈదేయడం తేలిక ...
స్వర్గమే లేదే అంటూ తోసేయక ...
సాధించే సత్తా ఉంటే చూసేయిక ...
మోమాటం అంటు కూర్చుంటే గుణపాఠం చెప్పి తీరాలిగా ...
సరదాగా జీవితం గడిపితే ప్రతి రోజూ పండగవ్వదా ...

Friday, April 23, 2010
ప్రస్థానం ...
పల్లవి:
నిద్దుర మాటున పోద్దును చూడని కన్నులది ఏ జ్ఞానం ...
నిప్పుల కోలిమిని ఉప్పెనలా ఎగజిమ్మినది ఈ వైనం ...
దేహములో దాగిన దైవాంశము వెతికిన శుభతరుణం ...
స్వార్థముతో నిస్స్వార్థము జరిపే యుద్ధం ప్రస్థానం ...
ప్రస్థానం .... ప్రస్థానం ...
చరణం 1:
మనువు తెలిపిన తనువు కలిపిన మదనరాగము మనిషి జననం ...
మనసు వీడిన మమత వాడిన దేహమాత్మగా మార్చు మరణం ...
నట్టనడిమిది నాటకం ... బ్రతుకు అన్నది బూటకం ...
కాయమన్నదశాశ్వతం ... కాలగర్భము అమృతం ...
ఆయువే కడతేరినా అమరత్వమైనది ఆత్మజ్ఞానం ...
నిన్ను నీవుగ తెలుసుకొమ్మని పలుకుతున్నది గీతసారం ...
చరణం 2:
కన్నుల మాటున మంటల సాక్ష్యం ప్రస్థానం ...
మంటల మాటున మమతల లక్ష్యం ప్రస్థానం ...
మమతల మాటున మనసుల లోతీ ప్రస్థానం ...
మనసుల మాటున నమ్మకమే ఈ ప్రస్థానం ...
ప్రస్థానం ... ప్రస్థానం ...
పది తలల రావణుల కూల్చే ప్రస్థానం ...
ప్రస్థానం ... ప్రస్థానం ...
సంధర్మ సంస్థాపనార్థం ప్రస్థానం ...
ప్రస్థానం ... ప్రస్థానం ... ప్రస్థానం ...

Tuesday, April 20, 2010
అద్వైత భావం ...
పల్లవి:
విడుదలై విడుదలై మౌనం ...
నను విడిచి వెళ్ళే గానం ...
పయనం ఎటైనా నిలవదే ...
విడిపోయి బ్రతికే కాలం ...
విడుదలై విడుదలై మౌనం ...
చరణం 1:
పదమే అలిగిందిగా అడుగే అటు వేయమంటే ...
కలలే గోదారిలా నా కనులే తడుపుతుంటే ...
ఈ విధి వలై విసిరిన గాయం ...
మసి చేసి కాదా శూన్యం ...
విడుదలై విడుదలై ప్రాణం ...
చరణం 2:
గతమై నిలిచాయిగా ఉడికే ఆ జ్ఞాపకాలే ...
దేహం విడిపోయినా ఈ స్నేహం వాడిపోదే ...
నువు నేను వేరై లేమని ...
అద్వైత భావం పలికే ...
విడుదలై విడుదలై మౌనం ...
విడుదలై విడుదలై మౌనం ...
నను విడిచి వెళ్ళే గానం ...
పయనం ఎటైనా నిలవదే ...
విడిపోయి బ్రతికే కాలం ...
విడుదలై విడుదలై మౌనం ...
చరణం 1:
పదమే అలిగిందిగా అడుగే అటు వేయమంటే ...
కలలే గోదారిలా నా కనులే తడుపుతుంటే ...
ఈ విధి వలై విసిరిన గాయం ...
మసి చేసి కాదా శూన్యం ...
విడుదలై విడుదలై ప్రాణం ...
చరణం 2:
గతమై నిలిచాయిగా ఉడికే ఆ జ్ఞాపకాలే ...
దేహం విడిపోయినా ఈ స్నేహం వాడిపోదే ...
నువు నేను వేరై లేమని ...
అద్వైత భావం పలికే ...
విడుదలై విడుదలై మౌనం ...
Tuesday, March 23, 2010
నిజమా ఇదే వరమా ...
పల్లవి:
చిత్రం చిత్రం చైత్ర మాసం ముందుకొచ్చే ...
చిన్ని చిన్ని ఆశలన్నీ ముంచుకొచ్చే ...
నిజమా ఇదే వరమా ...
ఊహల్లోని కలవరమా ...
చరణం-1:
నిన్నా లేదిల మొన్నా లేదిలా ఈ రోజేదో కొత్తగున్నదే ...
కంటి పాపలో స్వప్నమే ఇలా కన్ను కొట్టి కవ్విస్తున్నదే ....
ఈ హాయి నీవల్లే ... ఈ మాయ నీవల్లే ...
ఈ రేయి నాలోనే విరహాలు నీవల్లే ...
చరణం-2:
పూచే పూలల్లో వీచే గాలుల్లో గంధాలన్నీ ఆనందాలేగా ...
ఊగే ఊయల్లో సాగే దారుల్లో అందాలన్నీ బంధాలయ్యేగా ...
అందాలు నీలోనే ... గంధాలు నీలోనే ...
బంధాలు నాలోనే ... ఆనందాలు నాలోనే ...

Tuesday, March 16, 2010
పల్లవి:
ఎపుడు నీ చూపే కలిసి నీ వైపే లాగెనో ...
అపుడే సలీమున్నయ్యా ...
అపుడే గులామున్నయ్యా ...
ఇదిగో సలాం చేయనా ...
వెన్నెల్లో ఏవో వేవేల వర్ణాలే ...
కన్నుల్లో ఏవో వేవేల భావాలే ...
చరణం-1:
ఎపుడు కదిలిందో నీ కంటి సైగే మనసు మరిగేలే విరహాలతో ...
మనసు మరిగే విరహాలతో ...
వయసు కరిగే వడగాలితో ...
ఎపుడు నీ శ్వాసే వెచ్చగా నన్నే తాకెనో ...
అపుడే నసీబి మారే ...
అపుడే జవాబు కోరే ...
మౌనం నఖాబ్ తీయవా ...
చరణం-2:
ఎపుడు ఎగిరిందో నీ పైట కొంగే అపుడు తెలిసిందే సింగారమే ...
సింగారమే నయగారమా ...
ముంచావుగా మందారమా ...
ఎపుడు నీ మనసే మెల్లిగా నన్నే చేరెనో ...
ప్రాయమే రంగులై కురిసే ...
ప్రాణమే చెంగున ఎగసే ...
ప్రేమకే అర్థం తెలిసెనే ...

Friday, March 12, 2010
Who`s that GIRL ... ?
పల్లవి:
రంగు రంగుల వాన విల్లులా విరిసిన రూపమట ...
చంచల చకోర చూపులు పదునెక్కిన కత్తులట ...
తన నవ్వుల్లో పూల బాణాల మాయ దాగుందట ....
Who`s that GIRL ... Find now ...
చరణం-1:
పాదం పట్టీలే శబ్దం చేశాయా ...
పరుగున కాళ్ళను చూడ్డానికి కుర్రాళ్ళే క్యూ కట్టే ...
వీధిలోకొస్తే చాలంటా బోనాల్ జాతర జరిపేరంటా ...
ఈద్ సంక్రాంతి కలగలిపిన ఓ పండగ చేసేరంటా ...
చిరు నవ్వుల్తో కుర్ర గుండెల్లో చిచ్చు పెట్టిందటా ...
Who`s that GIRL Find now ...
చరణం-2:
నను చూసిందంటే నను చూసిందంటారే ...
నా కోసం తను పుట్టిందంటూ కోతలు కోస్తారే ...
మనలో ఆ మగధీరుడెవ్వరని యుద్ధానికి వస్తారంటా ...
ఎముకలు విరిగేలా ఒకరినొకరు తన్నుకు చస్తారంటా ...
నయగారంతో మన మగ జాతిని ముంచేస్తుందంటా ...
Who`s that GIRL Find now ...
( I think samantha...? here is her photo just find her)

Tuesday, March 9, 2010
ఏమ్మాయో ...
పల్లవి:
అతడు: ఏమ్మాయో ఏమైందో ఏమౌతున్నదో ఏమో మరి ...
ఆమె: ఏమ్మాయో ఏమైందో కొంచెం కొంచెం మైకం ఏదో కలుగుతూ ...
అతడు: ఇదో తుఫానై నిలువెల్లా నా మదినే ముంచినా ...
అదేంటో మనసే నా మనసే బాగుందంటున్నదే ...
ఆమె: హఠాత్తుగా ఈ సమీరం వడగాలై వీచినా ...
అదేంటో నాపైనే కురిసే మంచనుకుంటూ ఉన్నా ...
అతడు: నాలా నేను లేనే లేను ...
నీ చిలిపి ఊహల్లో తడిసి నీలోనే చేరా ...
ఆమె: నాలా నేను లేనే లేను ...
నీ చెలిమితో కలిసి నడిచి నీలాగా మారా ...
చరణం-1:
ఆమె: విసుగుతో కోపమంతా చూపుతూ కసురుతున్నా కమ్మగుంది ...
అతడు: గుండెలో బాధలన్నీ నసుగుతూ చెప్పుకుంటే హాయిగుంది ...
ఆమె: కష్టమంటూ ఉంది ... ఇష్టమంటూ ఉంది ...
అతడు: ఈ క్షణం పడే కష్టమే నీ ఇష్టాన్ని అందించదా ...
చరణం-2:
అతడు: ఒడ్డుపై చేపలా విలవిలా తన్నుకున్నా హాయిగుంది ...
ఆమె: ఒంటరై వెల్లినా నీడలో నిన్ను చుస్తే మాయగుంది ...
అతడు: స్వప్నమంటూ ఉంది ... సత్యమంటూ ఉంది ...
ఆమె: పోల్చుకో నువ్వే పోల్చుకో నీకై నువ్వే తేల్చుకో ...

Monday, March 8, 2010
రాధా ప్రేమించరాదా ...
పల్లవి:
బృందావనే గోపికా హృదయ చోరా ...
నందాత్మజా గోపకుల కీర్తీ వీరా ...
గోకుల బాల ... గోపికలేల ...?
అల్లరి లీల ... ఆపవదేల ...?
గోకుల బాల ... గోపికలేల ... అల్లరి లీల ... ఆపవదేల ...
రాధా ప్రేమించరాదా ...
నవనీత హృదయం నైవేద్యమవదా ...
రాగ రసమయ నది కాదా ...
చరణం-1:
చిన్నారి నవ్వుల్తో పొన్నారి నడకల్తో సుకుమారా నీవెక్కడ ...
సెలయేటిలో కన్నె జలతారు పుష్పాల చీనాంబరాలెక్కడ ...
ప్రియసఖి రాధ ... చీరల సరదా ...
తీర్చాలనుకొని దోచావు కదా ...
చెబితే వినదంట రాధ ...
చరణం-2:
సిందూర వర్ణాల మందార దేహాన కోపాలు సింగారమా ...
అరవింద నేత్రాల అరుణోదయాలన్నీ కురిపించడం న్యాయమా ...
వేలిపై కొండనే నిలిపిన వాడే ...
వేడుకుంటుంటే వినవా రాధ ...

Wednesday, March 3, 2010
జ్ఞాపకం ...
పల్లవి:
వేకువై తడిమే వేడిలో నీ శ్వాసలో స్పర్శే జ్ఞాపకం ...
వెన్నెలై తడిపే కాంతిలో నీ కంటిలో చూపే జ్ఞాపకం ...
ఊహల్లో నీ జ్ఞాపకం ...
ఊపిరిలో నీ జ్ఞాపకం ...
చరణం-1:
ఏ గాధలో ఏ మలుపులో ఏ గూటికో చేర్చేలా చేస్తాయిగా ....
ఏ బాధలో కన్నీరులే సెలయేరులై పొంగేలా చేస్తాయిగా ...
గాలిలో తేలే మేఘమే కరిగిపోతుందనే తెలిసినా ...
నేలపై వాలే పావురమే ఎగిరిపోతుందనే తెలిసినా ...
ఊహల్లోనే మిగలనా ...
చరణం-2:
నాదన్నదే ఏముందని నా నీడకే ప్రతి రూపం అయ్యావుగా ...
నేనన్నదే మరిచేంతగా మధు వానలో తడిసేలా చేసావుగా ...
నన్నిలా వేధించావని నేరుగా చెప్పలేనే కాలమా ...
గొంతులో గరళమే దాచినా పైకలా నవ్వుతావేం హృదయమా ...
విడిపోకే నా ప్రాణమా ...

Tuesday, March 2, 2010
అద్వైతం
పల్లవి:
నా నీడై నువ్వుంటూ ... నీ తోడై నేనుంటూ ...
కలకాలం సాగుదామా ...
ఆనందంలోనైనా ... ఆవేదనలోనైనా ...
ఏదైనా సగమై ఉందామా...
మన గట్టులే దాటామా ...
మరి గుట్టుగా కలిశామా ...
ఈ ద్వైతమే అద్వైతం కాదా ...
చరణం-1:
ఆలాపనలో రాగంలా ... ఆకాశంలో మేఘంలా ...
ఆ సంద్రంలో అలలాగా ఎపుడూ ఉందామా...
చిరుగాలై ఎద సవ్వడికే నే ఊపిరవనా ...
కనుపాపై చుట్టూ ఉన్న లోకం చూడనా ...
అరె బుడుకలో నువ్వుంటే ...
మరి బుడుతడై నే రానా ...
నీ అడుగులో అడుగే కాలేనా ...
చరణం-2:
మన రక్తం ఎరుపేగా ... మన మనసులు తెలుపేగా ...
మరి ఎందుకో ఈ దూరం ...
ఏ దేహంలోనైనా ... కొలువై ప్రాణం లేదా ...
మన పుట్టుకలోనే దూరం దాగుందా ...
మరి ఇన్నినాళ్ళు దేవా ...
విధి జూదమే ఆడావా ...
ఈ ద్వైతమే ...

Monday, March 1, 2010
తొలి వలపు
పల్లవి:
కళ్ళల్లో కదిలే స్వప్నం .... గుండెల్లో రగిలే విరహం ....
అంతా నీవంటూ ఉంటే కాదనలేకున్నా ...
మదిలో నీ తియ్యని రూపం ... పదిలంగా ఉందనుకుంటే ...
ఎటు చూసిన నువ్వే కనబడి వేదన పడుతున్నా ...
కల అని నేనెంతగా చెప్పినా కాదని అంటుందే మనసు ...
నీవైపే పరుగులు తీసిందే ...
తొలి వలపే వికసించెనా ....
నను వీడకే ప్రియ నేస్తమా ...
చరణం 1:
చిగురించిన పెదవుల పైన ... చిరునవ్వుల వెన్నెల వాన ...
అంతా నాదనుకుంటూనే సంబర పడుతున్నా ...
చిలకలోని తియ్యదనాలను ... పిలుపులోని కమ్మదనాలను ...
అన్నీ నీలోనే చూసి ఆనందిస్తున్నా ...
అలలాగా ఎగసిపడే నా మనసునెలా ఓదార్చేదీ ....
జ్ఞాపకాల పల్లకిలో నీవే ...
తొలి వలపే వికసించెనా ....
నను వీడకే ప్రియ నేస్తమా ...
చరణం 2:
నీలాల గగనంలోన ... మేఘాల ముసుగుల్లోన ...
తళుకుమన్న తారవు నీవని నేననుకుంటున్నా ...
ఊహలనే ఊసుల్లోన ... ఊరేగే నీ ప్రియ భావన ...
ఊరించి వదిలేస్తావని ఆలోచిస్తున్నా ...
నా నిన్నే పొందాలని నేనెంతగ నాలో నిన్నే కోరినా ...
నా ముందుకు రావెందుకు నేస్తం ...

Tuesday, February 16, 2010
యువతి మనసు ...
పల్లవి:
నాలో నీవేగా ... నీలో నేనేగా ...
దేహంలో పాకే ... దాహం నీదేగా ...
ఏమైనదో ఏమో ఈ అలజడి ...
చేసిందిలా నీకై అలికిడి ...
వయ్యారి కౌగిళ్ళ వాకిళ్ళలో చేరి ...
ఓ సారి ఊరించాలంది ...
ఓ సారి ఉడికించాలంది ...
చరణం-1:
ఎండల్లోనైనా ... మరి మంచుల్లోనైనా ...
మంచాన్నే వేసి గుండెల్లో పొడుకున్న ...
నీ రూపమే ఖైదుగా చేయనా ...
నా తాపమే విందుగా మార్చనా ...
లేనిపోని ఆలోచనలా ...
నన్ను నేను ఆపుకునేలా ...
ఇంత మార్పు చేశావేల ....?
చరణం-2:
ఏకాంతంలోన నా ఎద మీటుతున్న ...
ఐస్కాంతమైన నీ చూపే కనుగొన్నా ...
చిరుగాలితో నడుము సవరించగా ...
చిరుతల్లే దూకింది వయసాగక ...
అందమంత అందుకొనేలా ...
అందినంత దోచుకునేలా ...
ఏరికోరి వచ్చా రా ఇలా ...
నాలో నీవేగా ... నీలో నేనేగా ...
దేహంలో పాకే ... దాహం నీదేగా ...
ఏమైనదో ఏమో ఈ అలజడి ...
చేసిందిలా నీకై అలికిడి ...
వయ్యారి కౌగిళ్ళ వాకిళ్ళలో చేరి ...
ఓ సారి ఊరించాలంది ...
ఓ సారి ఉడికించాలంది ...
చరణం-1:
ఎండల్లోనైనా ... మరి మంచుల్లోనైనా ...
మంచాన్నే వేసి గుండెల్లో పొడుకున్న ...
నీ రూపమే ఖైదుగా చేయనా ...
నా తాపమే విందుగా మార్చనా ...
లేనిపోని ఆలోచనలా ...
నన్ను నేను ఆపుకునేలా ...
ఇంత మార్పు చేశావేల ....?
చరణం-2:
ఏకాంతంలోన నా ఎద మీటుతున్న ...
ఐస్కాంతమైన నీ చూపే కనుగొన్నా ...
చిరుగాలితో నడుము సవరించగా ...
చిరుతల్లే దూకింది వయసాగక ...
అందమంత అందుకొనేలా ...
అందినంత దోచుకునేలా ...
ఏరికోరి వచ్చా రా ఇలా ...
Saturday, February 6, 2010
వయసా ... వయసా ...
పల్లవి:
వయసా ... వయసా ...
వయసా ... వయసా ... తుళ్ళి తుళ్ళి తొందర పడకే ...
వయసా ... వయసా ... ఎందుకంత ఆగని పరుగే ...
కొమ్మ చాటు కోయిలలా మౌనంగా ఉండవటే ... చిగురుల తొడుగులు చూడవటే ...
మధురంగా పాడవటే ... ఆడవటే ...
చరణం -1:
ఏ నడి రాతిరిలో ... ఏ స్వప్న లోకంలో ... కళ్ళారా చూసిన ఘనుడే నీ వరుడా ...
నీ మనసుకి కళ్ళెం వేసిన వాడతడా ...
నీ వయసుకి పరుగులు నేర్పిన వాడతడా ... మన్మధుడా ...
జిలిబిలి పలుకుల సుందరుడా ...
ఎవరతడే ... ఎవరతడే ... చెప్పవటే ...
చరణం -2:
వేవేల పేరుల్లో ... నాదైన పేరేదో ... వేటాడి శోధించైనా కనుగొనవా ...
ఆ నామ స్మరణే జీవితం అనుకోవా ...
తను వేసిన అడుగుల వెంటే అడుగలా వేయాలి ...
అలసిన వేళల ఆగాలి ...
వలపులలో తడవాలి మురవాలి ఎదవాలి ...

Tuesday, February 2, 2010
ప్రియతమా ...
ప్రియతమా ... ప్రియతమా ... నీకిదే న్యాయమా ...
కళ్ళలో నిండిన సంద్రమా ...
నీ జతై నడిచిన సమయమే రాదని ....
నమ్మదే మనసుకే చెప్పినా ....
ఆరారు ప్రాయాలై విరబూసే కాలమే ...
ఈ రోజు నా ఎదలో నిలిచిందే గ్రీష్మమై ....
గతమయ్యే గురుతులనే చెరిపేలా ... గడియారం గునపంలా పొడిచిందే ...
చిరు చెపటే తుడిచే వలువే చేతికి బరువైందే ...
అడుగేయగా నా పాదాలకే లేదింకా ఆధారమే ...
అణగారిపోయేలా నా ఒంటిలో చెలరేగింది భూకంపమే ...
నీ రూపమే లేకుండా ఖననం చేసినా ...
నీ పేరు తలచే గుండెను ఆపడం సాధ్యమా ....

Subscribe to:
Posts (Atom)