పల్లవి:
అతడు: ఏమ్మాయో ఏమైందో ఏమౌతున్నదో ఏమో మరి ...
ఆమె: ఏమ్మాయో ఏమైందో కొంచెం కొంచెం మైకం ఏదో కలుగుతూ ...
అతడు: ఇదో తుఫానై నిలువెల్లా నా మదినే ముంచినా ...
అదేంటో మనసే నా మనసే బాగుందంటున్నదే ...
ఆమె: హఠాత్తుగా ఈ సమీరం వడగాలై వీచినా ...
అదేంటో నాపైనే కురిసే మంచనుకుంటూ ఉన్నా ...
అతడు: నాలా నేను లేనే లేను ...
నీ చిలిపి ఊహల్లో తడిసి నీలోనే చేరా ...
ఆమె: నాలా నేను లేనే లేను ...
నీ చెలిమితో కలిసి నడిచి నీలాగా మారా ...
చరణం-1:
ఆమె: విసుగుతో కోపమంతా చూపుతూ కసురుతున్నా కమ్మగుంది ...
అతడు: గుండెలో బాధలన్నీ నసుగుతూ చెప్పుకుంటే హాయిగుంది ...
ఆమె: కష్టమంటూ ఉంది ... ఇష్టమంటూ ఉంది ...
అతడు: ఈ క్షణం పడే కష్టమే నీ ఇష్టాన్ని అందించదా ...
చరణం-2:
అతడు: ఒడ్డుపై చేపలా విలవిలా తన్నుకున్నా హాయిగుంది ...
ఆమె: ఒంటరై వెల్లినా నీడలో నిన్ను చుస్తే మాయగుంది ...
అతడు: స్వప్నమంటూ ఉంది ... సత్యమంటూ ఉంది ...
ఆమె: పోల్చుకో నువ్వే పోల్చుకో నీకై నువ్వే తేల్చుకో ...

No comments:
Post a Comment