కాలం అచ్చొస్తే ...
గెలుపిక వరిస్తే ...
ఓటమి అనే మాటకే టాటా ...
పున్నమి అనే బాటకీ పూట ...
స్వాగతమనే నవ్వులను చూద్దాం ...
జీవితమనే పువ్వులను చేద్దాం ...
కాలం అచ్చొస్తే ...
గెలుపిక వరిస్తే ...
చరణం-1:
స్మైలిస్తే హుష్ కాకంటూ ఎగరక ...
సారోలే మిగులునా ఒంటరిగా ...
రాజసం చూపావంటే ఎదురుగా ...
కాలమే తలొంచదా రాణిగా ...
కలలే ఓ తీపి నిజమైతే తన సొమ్మేం అరిగిపోదుగా ...
అని కునుకే తీస్తూ కూర్చుంటే గత కాలమే తిరిగి రాదుగా ...
కాలం అచ్చొస్తే ...
గెలుపిక వరిస్తే ...
చరణం-2:
సాహసం చేసేయరా డింభకా ...!
సాగరం ఈదేయడం తేలిక ...
స్వర్గమే లేదే అంటూ తోసేయక ...
సాధించే సత్తా ఉంటే చూసేయిక ...
మోమాటం అంటు కూర్చుంటే గుణపాఠం చెప్పి తీరాలిగా ...
సరదాగా జీవితం గడిపితే ప్రతి రోజూ పండగవ్వదా ...
కాలం అచ్చొస్తే ...
గెలుపిక వరిస్తే ...