Search

Tuesday, March 16, 2010

పల్లవి:
ఎపుడు నీ చూపే కలిసి నీ వైపే లాగెనో ...
అపుడే సలీమున్నయ్యా ...
అపుడే గులామున్నయ్యా ...
ఇదిగో సలాం చేయనా ...

వెన్నెల్లో ఏవో వేవేల వర్ణాలే ...
కన్నుల్లో ఏవో వేవేల భావాలే ...

చరణం-1:
ఎపుడు కదిలిందో నీ కంటి సైగే మనసు మరిగేలే విరహాలతో ...
మనసు మరిగే విరహాలతో ...
వయసు కరిగే వడగాలితో ...

ఎపుడు నీ శ్వాసే వెచ్చగా నన్నే తాకెనో ...
అపుడే నసీబి మారే ...
అపుడే జవాబు కోరే ...
మౌనం నఖాబ్ తీయవా ...

చరణం-2:
ఎపుడు ఎగిరిందో నీ పైట కొంగే అపుడు తెలిసిందే సింగారమే ...
సింగారమే నయగారమా ...
ముంచావుగా మందారమా ...

ఎపుడు నీ మనసే మెల్లిగా నన్నే చేరెనో ...
ప్రాయమే రంగులై కురిసే ...
ప్రాణమే చెంగున ఎగసే ...
ప్రేమకే అర్థం తెలిసెనే ...