Search

Monday, March 8, 2010

రాధా ప్రేమించరాదా ...

పల్లవి:

బృందావనే గోపికా హృదయ చోరా ...
నందాత్మజా గోపకుల కీర్తీ వీరా ...

గోకుల బాల ... గోపికలేల ...?
అల్లరి లీల ... ఆపవదేల ...?
గోకుల బాల ... గోపికలేల ... అల్లరి లీల ... ఆపవదేల ...

రాధా ప్రేమించరాదా ...
నవనీత హృదయం నైవేద్యమవదా ...
రాగ రసమయ నది కాదా ...

చరణం-1:
చిన్నారి నవ్వుల్తో పొన్నారి నడకల్తో సుకుమారా నీవెక్కడ ...
సెలయేటిలో కన్నె జలతారు పుష్పాల చీనాంబరాలెక్కడ ...
ప్రియసఖి రాధ ... చీరల సరదా ...
తీర్చాలనుకొని దోచావు కదా ...
చెబితే వినదంట రాధ ...

చరణం-2:
సిందూర వర్ణాల మందార దేహాన కోపాలు సింగారమా ...
అరవింద నేత్రాల అరుణోదయాలన్నీ కురిపించడం న్యాయమా ...
వేలిపై కొండనే నిలిపిన వాడే ...
వేడుకుంటుంటే వినవా రాధ ...

No comments:

Post a Comment