చిత్రం చిత్రం చైత్ర మాసం ముందుకొచ్చే ...
చిన్ని చిన్ని ఆశలన్నీ ముంచుకొచ్చే ...
నిజమా ఇదే వరమా ...
ఊహల్లోని కలవరమా ...
చరణం-1:
నిన్నా లేదిల మొన్నా లేదిలా ఈ రోజేదో కొత్తగున్నదే ...
కంటి పాపలో స్వప్నమే ఇలా కన్ను కొట్టి కవ్విస్తున్నదే ....
ఈ హాయి నీవల్లే ... ఈ మాయ నీవల్లే ...
ఈ రేయి నాలోనే విరహాలు నీవల్లే ...
చరణం-2:
పూచే పూలల్లో వీచే గాలుల్లో గంధాలన్నీ ఆనందాలేగా ...
ఊగే ఊయల్లో సాగే దారుల్లో అందాలన్నీ బంధాలయ్యేగా ...
అందాలు నీలోనే ... గంధాలు నీలోనే ...
బంధాలు నాలోనే ... ఆనందాలు నాలోనే ...