Search

Saturday, February 6, 2010

వయసా ... వయసా ...

పల్లవి:

వయసా ... వయసా ...
వయసా ... వయసా ... తుళ్ళి తుళ్ళి తొందర పడకే ...
వయసా ... వయసా ... ఎందుకంత ఆగని పరుగే ...
కొమ్మ చాటు కోయిలలా మౌనంగా ఉండవటే ... చిగురుల తొడుగులు చూడవటే ...
మధురంగా పాడవటే ... ఆడవటే ...
 
చరణం -1:

ఏ నడి రాతిరిలో ... ఏ స్వప్న లోకంలో ... కళ్ళారా చూసిన ఘనుడే  నీ వరుడా ...
నీ మనసుకి కళ్ళెం వేసిన వాడతడా ...
నీ వయసుకి పరుగులు నేర్పిన వాడతడా ... మన్మధుడా ...
జిలిబిలి పలుకుల సుందరుడా ...
ఎవరతడే ... ఎవరతడే ... చెప్పవటే ...
 
చరణం -2:

వేవేల పేరుల్లో ... నాదైన పేరేదో ... వేటాడి శోధించైనా కనుగొనవా ...
ఆ నామ స్మరణే జీవితం అనుకోవా ...
తను వేసిన అడుగుల వెంటే అడుగలా వేయాలి ...
అలసిన వేళల ఆగాలి ...
వలపులలో తడవాలి మురవాలి ఎదవాలి ...

No comments:

Post a Comment