ప్రియతమా ... ప్రియతమా ... నీకిదే న్యాయమా ...
కళ్ళలో నిండిన సంద్రమా ...
నీ జతై నడిచిన సమయమే రాదని ....
నమ్మదే మనసుకే చెప్పినా ....
ఆరారు ప్రాయాలై విరబూసే కాలమే ...
ఈ రోజు నా ఎదలో నిలిచిందే గ్రీష్మమై ....
గతమయ్యే గురుతులనే చెరిపేలా ... గడియారం గునపంలా పొడిచిందే ...
చిరు చెపటే తుడిచే వలువే చేతికి బరువైందే ...
అడుగేయగా నా పాదాలకే లేదింకా ఆధారమే ...
అణగారిపోయేలా నా ఒంటిలో చెలరేగింది భూకంపమే ...
నీ రూపమే లేకుండా ఖననం చేసినా ...
నీ పేరు తలచే గుండెను ఆపడం సాధ్యమా ....
ప్రియతమా ... ప్రియతమా ... నీకిదే న్యాయమా ...
కళ్ళలో నిండిన సంద్రమా ...
నా ముందే ఎదురయ్యే ప్రతి దిశలో .... కళ్ళల్లో కనిపించే రంగుల్లో ...
నీ ఊసే మిగిలిందే నా స్మృతిలో ....
నువు లేనిదే నే లేనన్నది ఈ మాట నిజమే చెలీ ....
బ్రతికుండగా నీ ప్రతి జ్ఞాపకం ఔతుందే నా ఊపిరి ...
ఈ జన్మలో ఈ బాధే చితినే పేర్చినా ....
ఆ మరణ శాసనమే ఆహ్వానించనా ....

No comments:
Post a Comment