Search

Friday, April 23, 2010

ప్రస్థానం ...

పల్లవి:
నిద్దుర మాటున పోద్దును చూడని కన్నులది ఏ జ్ఞానం ...
నిప్పుల కోలిమిని ఉప్పెనలా ఎగజిమ్మినది ఈ వైనం ...
దేహములో దాగిన దైవాంశము వెతికిన శుభతరుణం ...
స్వార్థముతో నిస్స్వార్థము జరిపే యుద్ధం ప్రస్థానం ...
ప్రస్థానం .... ప్రస్థానం ...

చరణం 1:
మనువు తెలిపిన తనువు కలిపిన మదనరాగము మనిషి జననం ...
మనసు వీడిన మమత వాడిన దేహమాత్మగా మార్చు మరణం ...
నట్టనడిమిది నాటకం ... బ్రతుకు అన్నది బూటకం ...
కాయమన్నదశాశ్వతం ... కాలగర్భము అమృతం ...
ఆయువే కడతేరినా అమరత్వమైనది ఆత్మజ్ఞానం ...
నిన్ను నీవుగ తెలుసుకొమ్మని పలుకుతున్నది గీతసారం ...

చరణం 2:
కన్నుల మాటున మంటల సాక్ష్యం ప్రస్థానం ...
మంటల మాటున మమతల లక్ష్యం ప్రస్థానం ...
మమతల మాటున మనసుల లోతీ ప్రస్థానం ...
మనసుల మాటున నమ్మకమే ఈ ప్రస్థానం ...
ప్రస్థానం ... ప్రస్థానం ...
పది తలల రావణుల కూల్చే ప్రస్థానం ...
ప్రస్థానం ... ప్రస్థానం ...
సంధర్మ సంస్థాపనార్థం ప్రస్థానం ...
ప్రస్థానం ... ప్రస్థానం ... ప్రస్థానం ...