ఉదయం లేని లోకంలోనే కాలం గడిచి గడిచి ...
అనుక్షణం తీక్షణం ... ఐనదే తక్షణం ...
ఏ తీరం కోరానో నేనే తీరం చేరానో ...
విరహాలే..... విరహాలే.....
దూరాలే ప్రణయంలోని తీరాలే ....
-----------------------------------------------------------
సూర్యుడు రాడీ సమయంలో అని రాతిరి ఒడిలో చేరాగా ....
చీకటి కోరలు చెరసాలై కాటేసాయే అమావాస్యలుగా ....
నీకిదే న్యాయమా ..... జీవితం శూన్యమా ....
గమ్యం చేరేలోగా గమనం ఆగే సాయంత్రంగా .....
విరహాలే..... విరహాలే....
దూరాలే ప్రణయంలోని తీరాలే ....
-----------------------------------------------------------
ఒంటరి చూపులు ఎందుకని కనుపాపే సంధ్యను చేరింది ....
తీయని నిజమై కనిపిస్తానని తీరని కలలా మిగిలింది ...
నాకిదే శాపమా ... నరకమే ద్వారమా ....
నయగారంతో నాగినిలా చుట్టేసే విష జ్వాలలా ...
విరహాలే..... విరహాలే.....
దూరాలే ప్రణయంలోని తీరాలే ...
విరహాలే..... విరహాలే.....
ప్రేమించే గుండెల్లోన నరకాలే ...
విరహాలే..... విరహాలే..... విరహాలే ...
mee kavitalu bagunnai. Andarini aatalato, paatalato, maatalato baga aaandimpa chestunnaru. Dhanyavaadalu.
ReplyDeletemee pryatnam saphalamu agu gaaka.